30, ఆగస్టు 2017, బుధవారం

కూనలమ్మ అన్నసూక్తం



నమస్కరించు మెతుక్కి
దొరికినది దని బతుక్కి
అదిలేక మనికి హుళక్కి
ఓ కూనలమ్మా

పండించిన హస్తాలను
తలచి నమశ్శతాలను
భక్తి నిడిన చాలును
ఓ కూనలమ్మ

వండి యమృతాన్నాలను
వడ్డించిన హస్తాలను
మెచ్చుకొనిన చాలును
ఓ కూనలమ్మా

వేళ కింత తిండిని
పెట్టిన భగవంతుని
నుతించుట మంచిపని
ఓ‌ కూనలమ్మా

మెతుకుపట్ల వినయము
కలిగియున్న ననయము
మెతుకులిన్ని నిశ్చయము
ఓ‌ కూనలమ్మ

తనువు పెంచునది మెతుకు
మనసు నించునది మెతుకు
దాన్ని గౌరవించి బ్రతుకు
ఓ కూనలమ్మ

అన్నమే సర్వము
అన్నమే జీవము
అన్నమే దైవము
ఓ కూనలమ్మ

అన్న సూక్త మిదేను
తెలిసుకొన్న సరేను
భగవంతుడు మెచ్చేను
ఓ కూనలమ్మ



7 కామెంట్‌లు:

  1. జిలేబి గారు, మీ పద్యాల పదును పెరుగుతోంది. అన్నం పరబ్రహ్మ స్వరూపమని బాగా చెప్పారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్యగామి గారు,
      పొరబడ్డారు. జిలేబీ వేరు, కూనలమ్మ వేరు. కూనలమ్మ పేరును జిలేబీగారు కబ్జాచేయటానికి ప్రయత్నించటంతో మీరు మాయలోపడిపోయారు. ఈ విషయం నేను కొంతసూటిగానే తరువాతి టపాలో చెప్పినా మీరు అది చదువలేదో పట్టించుకోలేదో తెలియదు!

      తొలగించండి

    2. ఓలమ్మో

      ఇదేమి అపవాదు !


      శ్రీ యన్యగామికి! జిలే
      బీయమ్మకు కూనలమ్మ బిగువులు తెలియవ్ :)
      సోయగముల లే మ శుభాం
      గీయము ! కుకుకూ గురువుల కేకే కేకా :)

      జిలేబి

      తొలగించండి
    3. ఏమిటేమిటీ‌? అన్యగామి గారికి కూనలమ్మ బిగువులు తెలుసా. కూనలమ్మ ఎవరో తెలుసా. తెలిసే జిలేబీ‌ అని సంబోధించారా?

      ఏమండీ అన్యగామి గారూ‌ నిజమేనా ఈ‌సంగతి?
      తెలిసే కూనలమ్మను 'జిలేబీ‌' అని పిలిచి అవమానించారా?
      తెలియక అలా పిలిచినా, ఇప్పుడు కూనలమ్మ అన్నది మీ అభిమాన జిలేబీ‌ కాదని తెలిసి, పొరపాటున పొగడానే, ఇప్పుడు మళ్ళా అ వేరే వారి బ్లాగులో సారీ చెప్పేదేమిటిలే అని తూష్ణీంభావము వహించారా ఏమి? మీరే చెప్పాలి మరి. This is not at all correct. Koonalamma is very hurt. Particularly hurt with your silence.

      తొలగించండి

  2. అన్యగామి గారు

    మొత్తానికి కూనలమ్మ జిలేబి లో
    ఇరుక్కున్నట్లైంది గురుడి పరిస్థితి :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీగారు,
      మీరు నామచౌర్యంలో కూడా ఘటికులే. ఎవరో మీరు కూనలమ్మే అనుకుంటే అందుకు దారితీసేలా మీ రాతలే కారణం కాదా? అందుకే నామచౌర్యం‌ అన్నది. ఇదోరకం హాస్యం అనుకోమంటే కుదరదు. 'నేను కాదు' అని వివరణ ఇచ్చే తీరికా సంస్కారమూ‌కూడా మీకు లేదా?

      తొలగించండి

ఏ మంటారూ?